జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 6
తాడివారిపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై మరియు పంట మార్పిడి పై శిక్షణ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి నిర్వహించారు. గతంలో పొగాకు పంట సాగుచేసిన రైతులందరూ ప్రత్యామ్నాయ పంటగా ఈ సంవత్సరం రబీ సీజన్ లో మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపారు. గత సంవత్సరం పొగాకు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల దృష్ట్యా రైతులందరూ మొక్కజొన్న సాగుపై దృష్టి సారించాలని తద్వారా అధిక లాభాలను పొందాలని ఆమె తెలిపారు. మొక్కజొన్న సాగులో సమగ్ర పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టుట ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చని రైతులకు సూచించారు. మొక్కజొన్నలో ముఖ్యంగా కత్తెర పురుగు మరియు కాండంతోలుచు పురుగులను క్లోరోపైర్ఫాస్ 50 ఈసీ 2.5 ఎం ఎల్ లీటర్ నీటికి లేదా ఏమమెక్టిన్ బెంజోయేట్ 80గ్రా లీటర్ నీటికి లేదా క్లోరాంత్రీనిప్రోల్ 60 యం యల్ లీటర్ నీటికి పిచికారి చేసుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. ప్రభుత్వం జీవో నెంబర్ 740 ప్రకారం పొగాకు సాగు నిషేధించడం వలన రైతులు ఎక్కువగా అధిక దిగుబడులు, అధిక లాభాలు ఇచ్చే మొక్కజొన్న పంటను పొగాకు పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసుకోవాలని ఆమె తెలియజేశారు. పంట మార్పిడి తప్పక పాటించాలని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో తాడివారిపల్లి గ్రామ సర్పంచ్ జాన్ రత్నం, పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో, ఏఈఓ దేవేంద్ర గౌడ్, విఏఏ వెంకటేశ్వర రెడ్డి,తాడివారిపల్లి గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.



