జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 6
జనసేన పార్టీ మార్కాపురం ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లె గ్రామంలో జనసేన గ్రామ పార్టీ కమిటీని ఎన్నుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలని , పవన్ కళ్యాణ్ ఆశయాలని ప్రజల్లోకి బలంగ తీసుకువెళ్లాలని జనసేన మండల నాయకులు వెలుగు కాశీరావు తెలియచేశారు. ఈ సందర్భంగా కూటమిలోని అన్ని పార్టీలని కలుపుకొని ప్రజలకు సేవ చేయాలని అలాగే రాబోయే స్థానిక ఎన్నికలకి సిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ నాయకులు రొడ్డ శ్రీను, వెన్నా రాజారామిరెడ్డి, కొండెబోయిన సునీల్, గంజరపల్లి మహేష్, చీకటి శివకాశి, గడ్డం బాలరాజు, పఠాన్ కరిముల్లా, వన్నెబోయిన వెంకటేష్, షేక్ రఫీ, సయ్యద్ రఫీ, షేక్ మస్తాన్, షేక్ నాగుర్ పాల్గొన్నారు…


