జనం న్యూస్ 06 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గ్రామపంచాయతీ కార్మికులను తొలగించడం సరైన పద్ధతి కాదు మళ్లీ వాళ్లను గ్రామపంచాయతీ కార్మికులును వెంటనే తీసుకోవాలి ఐ యాప్ టి యు ఆధ్వర్యంలో డి ఎల్ పి ఓ ప్రవీణ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు
తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధం రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను ఎలాంటి సమాచారం లేకుండా రాజకీయ కరణాలకు గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులను తొలగిస్తున్నారు సర్పంచ్. ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గ్రామంలో పనిచేస్తున్న కార్మికులను తొలగించి కొత్తవారిని నియమించుకుంటామని గ్రామంలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారు వారిని తొలగించి మేము వేరే వాళ్ళని నియమించుకుంటామని చెప్తున్నారు 1 జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి కావున వాటిని వెంటనే చెల్లించాలి2 గ్రామపంచాయతీలొ డబ్బులు ఉన్న అధికారులు ఇతర పనులకు ఆ డబ్బులను ఖర్చుల కింద వాడుకుంటున్నారు కావున ప్రభుత్వ అధికారులు యుద్ధ ప్రతిపాదికన గ్రామపంచాయతీ సిబ్బందికి పెండింగ్ లో ఉన్న జీతాలను తక్షణమే అందేడ్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం 3 ప్రతినెల రెగ్యులర్గా వేతనాలు చెల్లించాలి నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలి 4 ప్రతి గ్రామపంచాయతీ వర్కర్ కు ఇన్సూరెన్స్ 500000 అమలు చేయాలి ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయలు ఇవ్వాలి 5 వయసు మీరుందని సాకుతో కార్మికులను మారిస్తే ఆ కుటుంబంలో ఒకరికి స్థానం కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గా ఐదు లక్షలు ఇవ్వాలి 6 ఏడాదికి మూడు జతల యూనిఫామ్ చెప్పులు మరియు సబ్బులు నూనెలు ఇవ్వాలి లేదా వాటికి సరిపడే డబ్బులు నా అలవెన్స్ రూపంలో ఇవ్వాలి 7 కార్మికులను అక్రమంగా తొలగింపులు అధికారుల సర్పంచుల వేధింపులు ఆపాలి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు పరంజ్యోతి గోవిందు బుడ్డన్న వెంకటేశు నవాబు రాముడు బింగుదొడ్డి శ్రీనివాసులు బీరెల్లి నాగరాజు గంగనపల్లి జయన్న తదితరులు పాల్గొన్నారు


