Listen to this article

జనం న్యూస్ 06 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర నేషనల్ గ్రీన్ క్రాప్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా నేషనల్ గ్రీన్ క్రాప్ కోఆర్డినేటర్ శ్రీధర్ ఆధ్వర్యంలో గద్వాల్ సంస్కార్ స్కూల్ నందు నిర్వహించడం జరిగినది.చిన్నారులను అభినందించిన పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి ప్రిన్సిపాల్ సంధ్యా శ్రీనివాస్ రెడ్డి..తెలంగాణ జాతీయ పచ్చని పంట వ్యర్ధాల నుండి కూడా సంపదను పొందవచ్చు అన్న విషయాలను తెలంగాణ రాష్ట్ర గ్రీన్ క్రాప్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్ అధ్యక్షతన గద్వాల్ సంస్కార్ స్కూల్ నందు విద్యార్థులు అద్భుతమైన రీతిలో వ్యర్థమైన వాటిని మనందరకు ఉపయోగపడేటట్లు చేసి ఔరా అనిపించారు. సంస్కార్ స్కూల్ ప్రిన్సిపల్ సంధ్యా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు తెలంగాణ జాతీయ పచ్చని పంట వ్యర్థాల నుండి సంపద’ కార్యక్రమాన్ని అద్భుత విజయం సాధించేలా చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్సుమాంజలి అంటూ తెలియపరిచారు. సీనియర్స్ రివార్డుల విజేతలను ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము: 1. అవంతిక 1500/- మొదటి బహుమతి 2. లహరి మరియు అనుశ్రీకి 1000/- రెండవ బహుమతి 3. భావ్యకు 500/-మూడవ బహుమతి సాధించారు. మరియు జూనియర్స్ రివార్డులు:
1. ధాత్రి మరియు ఆర్యకు 1500/-మొదటి బహుమతి 2. హన్సి నందితకు 1000/-రెండవ బహుమతి
3. అరిజ్‌కు 500/-మూడవ బహుమతి సాధించారు. మా కాంటెంపరరీ విజేతలకు ప్రత్యేక అభినందనలు:
మేదాంశ్‌కు 500/- సాన్వికి 500/- జ్ఞానేశ్వర్‌కు 500/- సుస్థిరత పట్ల మీ వినూత్న స్ఫూర్తి మరియు అంకితభావం మనందరికీ స్ఫూర్తినిస్తాయి! ఈ కార్యక్రమాన్ని మరచిపోలేనిదిగా చేసిన ప్రతి చిన్నారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గ్రీన్ క్రాప్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్ కి వారి బృందానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్ పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్య శ్రీనివాస్ రెడ్డి అధ్యాపక బృందం వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.