జనం న్యూస్ 06 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ తో కలిసి సందర్శించిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు
జూరాల ప్రాజెక్టు నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీరు తీసుకోవాల్సిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారంపై మరియు నీటి లభ్యత లేని జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం చేపడతాం అన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటనలను,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవడానికి అనుకూలం కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఎమ్మెల్యే విజయుడు,మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి,అంజయ్య యాదవ్, మరి జనార్దన్ రెడ్డి,పట్నం నరేందర్ రెడ్డి,రాజేందర్ రెడ్డి,ఆల వెంకటేశ్వర్ రెడ్డి లతో కలసి, గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు జూరాల ప్రాజెక్టును సందర్శించారు….ఈ కార్యక్రమంలో జాంపల్లి వెంకటేశ్వర రెడ్డి, రాజారెడ్డి, వెంకటేష్ నాయుడు,మోనేష్,గంజిపేట రాజు,చక్రీధర్ రెడ్డి,శ్రీరాములు,శ్రీనివాస్,గోవిందు,భరత్ సింహారెడ్డి,లక్ష్మారెడ్డి,అబ్రహం,నాగరాజు,గొనుపాడురాము,రజినిబాబు,శ్రీనివాసులు,వెంకటేష్,నరసింహులు,రవి,వీరేష్,ఉమ్మడి మహబూబ్ నగర్ మరియు గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..


