వైసిపి లో కష్టానికి తగ్గ ఫలితం లేదని ఆవేదన
ఎం వి ఆర్ వెనకే తన ప్రయాణమని ఉద్ఘాటన
అనకాపల్లి : వైసిపి పార్టీకి ఎనలేని సేవలందిస్తున్న నన్ను కొంతమంది నాయకులు తీరుపట్ల తీవ్ర మనస్థాపానికి గురవడం వలన వైఎస్ఆర్సిపి కి రాజీనామా చేస్తున్నానని అనకాపల్లి నియోజకవర్గ బూత్ వింగ్ అధ్యక్షులు గైపూరి రాజు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని నర్సింగరావు పేట లో గల ఎం.వి.ఆర్ ప్రధాన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడుతూ, పార్టీకి కష్ట సమయాల్లో విధేయుడు గా ఉంటున్నా తన పట్ల సరైన ఆదరణ చూపించకపోవడం అన్యాయమన్నారు. పట్టణంతో పాటు నియోజవర్గంలో ఎన్నో సమయాలలో పార్టీకి మాటల్లో చెప్పలేనంత సేవలందించానని, అయి నను తనను గుర్తుంచకపోవడం దారుణమన్నారు. నా చేతికి గాయమైనప్పుడు పార్టీ తరుపున ఒక్కరూ కూడా పరామర్శించడానికి రాలేదని గైపూరి కన్నీటి పర్యవంతమయ్యారు. ఆనాడే పార్టీకి రాజీనామా చేసేందుకు నిశ్చయించుకున్నానన్నారు.ఆ సమయంలో నన్ను ఆపద్బాంధవుడు లాగ,ప్రముఖ సంఘసేవకుడు ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) ఆదరించారన్నారు. హాస్పిటల్లో ఉంటున్న నన్ను పరామర్శించి, నాకు ఆర్థిక సాయం అందించా రన్నారు. అటువంటి మహోన్నతుడు వెంట ఉండేందుకు నిశ్చయించుకున్నానని, ఇకనుంచి నా తరుపున ఎం వి ఆర్ కు అండదండలు అందిస్తూ ఆయన అడుగుజాడలలోనే నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం ఆయన ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లినను, ఎం వి ఆర్ వెంటే ఉంటానని గైపూరి రాజు హామీ ఇచ్చారు.//


