Listen to this article

ఆదివాసి ఆత్మబంధువు, ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి & ఎలిజబెత్ దంపతుల 39వ వర్ధంతి సభ పోస్టర్లను .ఐ టి డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యువరాజ్ మారమ్మాట్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డార్ఫ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి సభను ప్రభుత్వ పరంగా నిర్వహించాలని కోరగా, పీఓ యువరాజ్ గారు సానుకూలంగా స్పందించారు. వారి జీవిత చరిత్రను విస్తృతంగా ప్రజలకు తెలియజేస్తూ, ఆదివాసీ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.
అలాగే, అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని పీఓ గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో
మార్లవాయి గ్రామపంచాయతీ సర్పంచ్ కనక ప్రతిభ, గ్రామ పటేల్ ఆత్రం హనుమంతరావు,ఉప సర్పంచ్ ఆత్రం రాజేశ్వర్,డార్ఫ్ కార్యనిర్వహకుడు సోయం రాజు,గేడం గణపత్ రావ్, కనక భుజంగ్ రావ్, మందడి లింగు, ఆడ సింగు, గేడం తరుణ్,ఆదివాసీ నాయకులు వెట్టి మనోజ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.