Listen to this article

జనం న్యూస్ 6డిసెంబర్. కుమ్రం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

కుమ్రం భీం జిల్లా కలేక్టర్ వెంకటేష్ దోత్రే ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేసి,వినతి పత్రని సమర్పించిన, ప్రజా సంఘాలు, ఆదివాసి సంఘాల ప్రతినిధులు జిల్లాలోని కోన్ని ప్రభుత్వ ఆసుపత్రులో ఇటివల్ల వేసిన డైట్ టెండర్ ను రద్దు చేయాలని కుమ్రం భీం జిల్లా పాలన ఆధికారి వెంకటేష్ దోత్రే కుప్రజాసంఘాల ప్రతినిధులు, ఆదివాసి సంఘాల ప్రతినిధులు పలువురు నాయకులు వినతి పత్రం అందించారు కుమ్రం భీం ఆసిపాబాద్ జిల్లాలో కోన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మరియు ఆసిపాబాదు మెడికల్ కాలేజీకి సంబంధించిన డైట్ టెండర్ ను ఇటివల్ల కాలంలో ఆధికారులు వేయడం జరిగినది. తేది:-23 -2 -2025 న డైట్ టేండర్ వేసి ప్రభుత్వ నియమాలు పాటించకుండనే టేండర్ ప్రక్రియ జరిగినది ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపరిండేంట్ లకు తెలియకుండానే, టెండర్ ప్రక్రియను సంబంధిత అధికారులు జరపడలేదు, అదేవిధంగా ఈ టెండర్ కు సంబంధించిన ఆధికారులు మాట్లాడిన చరవాణి రికార్డింగ్ సంభాషణలు మా దగ్గర ఉన్నవని వినతి పత్రంలో తెలిపారు,డైట్ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అట్టి నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత ఆసుపత్రులలో బోర్డు నందు అంటించవలసి ఉంటుంది గానీ ఎక్కడ అసుపత్రులలలో కూడ అంటించలేదు తదనంతరం టెండర్ వేసినట్లు ఆన్ లైన్ లో అట్టి సమాచారం కూడ పొందుపరచలేదు. ఈ టెండర్ కు సంబంధంలేని జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ ను బెల్లంపల్లి నుండి డిప్యూటేషన్ పై ఆసిపాబాదుకు అనాఫీసియల్ గా తీసుకువచ్చి ప్రస్తుతం ఆసిఫాబాద్ లో ఉన్నా జూనియర్ అసిస్టెంట్ ని పక్కనపెట్టి అట్టి సమాచారాన్ని ఆయనకు తెలియకుండానే టెండర్ ప్రక్రియ జరిగినది, ఈ జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ ని ఇంతకుముందు పాత డైట్ కాంట్రాక్టర్ అనుచరుడు లాలు కావాలని ఆసిఫాబాద్ డిప్యూటేషన్ పై తీసుకొని రావడం జరిగినది ఇట్టి టెండర్ ప్రక్రియలో మొత్తం 18 దరఖాస్తులు రాగా ఝాన్సీ పేరిటా 7 దరఖాస్తులు, జలీల్ పేరిట 5 దరఖాస్తులు, సంతోష్ పేరిట 2 దరఖాస్తులు, మాధవ్ పేరిటా, 2 దరఖాస్తులు సునీత ఒకటి దరఖాస్తు లు వారు చేసినారు,
ఇందులో నాన్ లోకల్ అయినా ఖానాపూర్ కు సంబంధించిన లాలు అనే వ్యక్తి ఝాన్సీ,జలీల్, సంతోష్ పేరిట ఆరు డైట్ టెండర్లను దక్కించుకోవడం జరిగినది అదేవిధంగా స్థానికంగా ఉన్నా కుమ్రం భీం జిల్లాకు సంబంధించిన వారికి ఇద్దరికి మాత్రమే రావడం జరిగినది, స్థానికుడు కాకపోయిన లాలు అనే వ్యక్తి బినామీ వ్యక్తుల పేరిట 6 టెండర్లను దక్కించుకున్నాడు. దీనివలన కుమ్రం భీం జిల్లాకు సంబంధించిన వారికి తీరని అన్యాయం జరిగింది. ఇట్టి టెండర్ ను వెంటనే రద్దు చేస్తూ.. స్థానికంగా ఉన్నవారికి అవకాశం కల్పించాలని తమరిని కోరుతున్నామని విన్నవించారు ఈకార్యక్రమంలో కనక యాధవరావు ఆదివాసి సంఘాల ఐకాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. దుర్గం.దినకర్.కె వి పి ఎస్ జిల్లా కార్యదర్శి. గోడిసెల.కార్తీక్. డి వై ఎఫ్ ఐ.జిల్లా కార్యదర్శి. గెడం.టికానంద్.డి వై ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు ఆడ వెంకటేష్ ఆదివాసి మిత్ర వెల్పర్ సోసైటి చైర్మన్.దుర్గం. నిఖిల్.డి వై ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు.వడ్లూరి.మల్లేష్.KVPS. కె వి పి ఎస్ జిల్లా నాయకులు ఉన్నారు