Listen to this article

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్

జనం న్యూస్ 6కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

కొముర భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ డిమాండ్ చేశారు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యారంగ సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా జైనూర్ మండలంలోని పలు విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైనుర్ చుట్టుపక్కల మండలాల విద్యార్థులు ఇంటర్ పూర్తయిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక అక్కడే చదువు మానేసి పరిస్థితి ఉందని చాలా మట్టుకు విద్యార్థులు ఇంటర్ తర్వాత డ్రాపవుట్స్ అవుతున్నారని అన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న నాలుగు మండలాల విద్యార్థులకు ఉన్నత చదువు చదువుకునే అవకాశం ఉందని తెలిపారు అదేవిధంగా మండలంలోని విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తీవ్రంగా నీటి సమస్య ఉందని ఇంటర్ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు చాలామంది ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు అంజన్న, తిరుపతి,జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు