జనం న్యూస్:5 డిసెంబర్ మంగళవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సమసమాజ మార్పుకు సాహిత్యం అవసరమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆదివారం ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కాల్వ రాజయ్య రచించిన రాచబాట పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన కేడం లింగమూర్తి మాట్లాడుతూ పండిత పామరులను అలరించేది పద్యమని, పద్యాలు ప్రజలలో చైతన్యం తెస్తుందన్నారు. విశిష్ట అతిథి అవుసుల భానుప్రకాష్ మాట్లాడుతూ పద్యం అజరామరం వరకవి సిద్దప్ప వారసులుగా కాల్వ రాజయ్య రచనలు ఉన్నాయన్నారు. నదీ తీరాలలో సాహిత్యం ఫరిడవిల్లుతుందని, సాహిత్యం మనిషిని పరమోన్నతుడౌతాడని, సమాజానికి దిశానిర్ధేశం చేసేది కవులన్నారు. విశాలభావంతో రచనలు సాగాలన్నారు. అక్షరసృష్టి ఆగదంటూ, అలతి అలతి పదాలతో అద్భుతమైన రచనలు చేయవచ్చని చరుత్రలో నిల్చిపోయేలా రాచబాట శతకం ఉందన్నారు. గొర్రె కాపరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ పశువుల కాపరులుగా సాహిత్య సృజన చేసిన మహనీయులు చరిత్రతో పాటుగా పల్లె అందాలలోని సాహిత్యాంశాలు తెలిపారు. రాచబాట పుస్తక రచయిత కాల్వ రాజయ్యను ఘణంగా సత్కరించారు. కార్యక్రమంలో కవులు ఉండ్రాళ్ళ రాజేశం, పిట్ల దాసు, మామిండ్ల ఐలయ్య యాదవ్, ఐతా చంద్రయ్య, కొండి మల్లారెడ్డి, రాజమౌళి, ఎల్లం యాదవ్, బాలయ్య, అశోక్, గంగారాం, అంజయ్య, సరస్వతీ రామశర్మ, వెంకటేశ్వర్లు, మహేంద్రారెడ్డి, నరసింహారావు, మల్లికార్జున్, చంద్రశేఖర్, రాజు, లక్ష్మయ్య, రాజ్ కుమార్, బాల్ నర్సయ్య, అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు


