

జనం న్యూస్ ఫిబ్రవరి 6 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)అమలాపురం డి.ఎస్.పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ ..మోటార్ సైకిల్ దొంగతనలకు పాల్పడుతున్న ఆరుగురు యువకులను అరెస్ట్ చేసి 13 మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు అమలాపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ తెలిపారు. అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలు వల్ల యువత చెడు మార్గం పట్టి ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కేవలం గంజాయి తదితర వాటికి లొంగిపోయి యువత చెడు మార్గం పడుతుందన్నారు. కోనసీమలోని వివిధ పోలీస్ స్టేషన్ తో పాటు విశాఖపట్నం పరిధిలోని పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు కాగా మరో ముగ్గురు 20 సంవత్సరాలు దాటి యువకులు అన్నారు.ఈ నేరాలకు పాల్పడినమేకల వీర వెంకట శ్రీరామ్ మూర్తి, వీరమల్లు తరుణ్ శశి కుమార్, దొంగ లోకేష్ లను అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచ్చినట్లు డి.ఎస్.పి తెలిపారు. రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ పర్యవేక్షణలో తాలూకా సబ్ ఇన్స్పెక్టర్ వై శేఖర్ బాబు. క్రైమ్ సిబ్బంది ఈ యువకులు పట్టుకోవడంలో శ్రమించారన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు ముందుకెళ్లిందన్నారు. పెద్ద ఇళ్ళు నిర్మించుకునే ప్రతి వ్యక్తి ఇంటికి సీసీ కెమెరాలు వేయించుకుంటే ఫలితాలు ఉంటాయని డిఎస్పి ప్రసాద్ తెలిపారు. సీఐ ప్రశాంత్, ఎస్ ఐ శేఖర్ బాబు తో పాటు క్రైమ్ స్టాఫ్ కు ఎస్పీ శ్రీ కృష్ణారావు రివార్డులు అందింస్తారని ఆయన అన్నారు.