Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 6 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) గుండెపోటు వంటి విప త్కర పరిస్థితుల్లో సకాలం లో సత్వర వైద్యం పొంది నపుడే ప్రాణాన్ని నిలబె ట్టుకోగలమని ముమ్మి డివరం సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్య నిపు ణులు డా.పెంకె పృధ్వీ (ఎం.డి. జనరల్మెడిసిన్) అన్నారు. గుండెపోటుకు గురైన సమయంలో స్థాని కంగా సామాజిక ఆరోగ్య కేంద్రం ముమ్మిడివరం నందు అత్యవసర వైద్యం కు అన్ని ఏర్పాట్లు ఉన్నాయాని మెడికల్ సూప రింటెండెంట్ డాక్టర్ బి. సాయి శృతి బుధవారం ఒక ప్రకటనలో వివరించారు. గుండెనొప్పి రోగులకు స్వాంతన చేకూరలా హబ్ అండ్ స్పోక్ విధా నంలోరూ. 40,000 ఖరీదు చేసే ఇంజక్షన్ను అవసరమైన రోగు లకు ఉచితంగా అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. ఎవరికైనా గుండె నొప్పి వస్తే వైద్యులు వారికి ఈసీజీ తీసి రోగులు వివరాలు వారి సమస్యను పెద్ద ఆస్పత్రికి (హబ్) పంపు తున్నారు. వాటిని పరి శీలించి ఉన్నత వైద్య నిపుణులు ఆయా రోగులకు ఇంజెక్షన్ అవ సరమో కాదో చెబుతారని దాని బట్టి అవ సరమైన వారికి వెంటనే స్థానిక ఆస్పత్రి వైద్యులే తేనెక్టీప్లేస్ ఇంజెక్షన్ ఇస్తారాన్నారు.