జనం న్యూస్ 07 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ మరియు సమితి నాయకులు.
జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి. కల్వకుంట్ల కవిత ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ మరియు సమితి నాయకులు ఈరోజు హైదరాబాదులోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నడిగడ్డ రాజకీయ తాజా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, మరియు మండలాల అధ్యక్షులు విష్ణు,బలరాం నాయుడు, మండల నాయకులు గొంగళ్ళ విజయ్,జమ్మన్న, లక్ష్మన్న మీసాల కిష్టన్న, గోపాల్, భీమన్ గౌడ్,మునెప్ప,భూపతి నాయుడు, గొర్ల తిమ్మప్ప, వెంకటేష్,రాము, రంగస్వామి, ఏసన్న, బలిజ రాజు,అంజి,సుదర్శన్,విజయ్,తదితరులు పాల్గొన్నారు.


