జనం న్యూస్ 07 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ జన్మదిన సందర్భంగా మరియు గద్వాల జిల్లా కలెక్టర్ గా రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ గద్వాల ఎమ్మెల్యే ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను తెలిపారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ , జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు కురుమన్న, రామకృష్ణ నాయుడు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


