Listen to this article

జనంన్యూస్. 07.నిజామాబాదు.

తెలంగాణ ట్రైబల్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, చక్రధర్ నగర్ తాండాలో నిర్వహించిన ప్రత్యేక శిబిరం సందర్భంగా గ్రామపంచాయతి లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పరిసరాలలో పరిశుభ్రత , ప్లాస్టిక్ నిర్మూలన, భృణహత్యలు , ఆడపిల్ల చదువు మతులకు అంశాలపై అవగాహన ర్యాలీ నిర్వహించినారని క్యాంప్ కో ఆర్డినేటర్ వి.జ.లక్ష్మీ తెలియజేశారు.నేటి యువత సమాజానికి ఆయువు పట్టని వారి సేవలు అమోఘం అని కళాశాల ప్రిన్సిపాల్ సయ్యదా జైనబ్ మేడం, వైస్ ప్రిన్సిపాల్ సుధా సింధు మేడం తెలియజేశారు. పచ్చదనం -ఆవశ్యకత గురించి బోటనీ విభాగం మౌనిక మేడం అవగాహన గ్రామ ప్రజలకు కల్పించారు. వాలంటీర్లు,వారి యొక్క అంకిత భావాన్ని సర్పంచ్ పీరూ బాయి , వీర్ కుమార్ కొనియాడారు.ఉపసర్పంచ్ అమ్రు , వార్డు సభ్యులు గంగారాం, శ్రీను పాల్గొని ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లను ప్రోత్సహించారు.