Listen to this article

జనం న్యూస్ జనవరి 06: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ వారు సామూహిక ప్రథమశ్రేణి గుంపు ప్రదర్శన సి ఎఫ్ ఎల్ డి కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతులకి అధిక దిగుబడి ఇచ్చే జె సి ఎస్ 1020 (జగిత్యాల తిల్) రకం నువ్వుల విత్తనాలు పంపిణీ చేసారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రస్తుతం పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నువ్వులలో అధికదిగుబడికి పాటించాల్సిన మెళుకువలు అలాగే కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి రైతులకి వివరించారు. గ్రామసర్పంచ్ పావని భానుచందర్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. ఏర్గట్లవ్యవసాయ అధికారి వైష్ణవ్ ఈ సి ఎఫ్ ఎల్ డి కొరకు ఏర్గట్ల మండలం ఎంచుకున్నందుకు కృషి విజ్ఞాన కేంద్రం వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పావని భానుచందర్, కేవీకే కోఆర్డినేటర్ సుప్రజ, శాస్త్రవేత్తలు ఇందుధర్ రెడ్డి, శ్వేత, మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్, విస్తరుణాధికారి మనీషా, గ్రామ రైతులు పాల్గొన్నారు.అలాగే గుమ్మిర్యాల్ గ్రామంలో సాగులో ఉన్న జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు విధానం పరిశీలించారు. పసుపు ఆకులనుండి నూనె తీసే కేంద్రాన్ని సందర్శించారు. గుమ్మిర్యాల్ గ్రామ సర్పంచ్ జమున సంజీవ్ , విస్తరుణాధికారి సాయి సచిన్, అభ్యుదయ రైతులు సోమ రాజారెడ్డి, బద్దం గంగ రాజేశ్వర్ వారి వెంట ఉన్నారు.