Listen to this article

ఏంపి, కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన,

మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్-ఆదివాసి సంఘాల ఐకాస వర్కింగ్ ప్రసిడేంట్ కనక యాధవరావు.

జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

జైనూర్ :- జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత మండలాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఏక్కువ మొత్తంలో కేటాయించాలని ఏజెన్సీ మండలాలకు ఆధిక ప్రాధాన్యత కల్పించాలని,ఏజెన్సీ మండలాలలోని పలు గ్రామాలలో బిటి రోడ్లు,సిసి రోడ్లు, వివిధ మౌళిక వసతులకోసం నిధులు తప్పక కేటాయించాలని, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆదివాసి సంఘాల ఐకాస రాష్ట్ర వర్కింగ్ ప్రసిడేంట్ కనక యాధవరావు కోరారు. దుబ్బగూడ మాజీ సర్పంచ్ మడవి భీంరావు తో కలిసి,ఆదిలాబాదు పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ నివాసంలో ఆయనను మార్యద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు, ఏజెన్సీ మండలాలకు కేంద్ర ప్రభుత్వ ఏంపి, నిధులను కేటాయించి గ్రామాల అభివృద్దికి, కృషిచేయాలని, వారు కోరినారు.ఆయన సానుకులంగా స్పందించి, తప్పక ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తాను అని ఆయన హమీ ఇచ్చారని వారు తెలిపారు.వారితో, కేంద్రే విషల్ ఉన్నారు.