పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన కోవలక్ష్మి
జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
ఆసిఫాబాద్ : ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి హైదరాబాదులోని ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ నామకరణం చేసినప్పటికీ కళాశాల వద్ద బోర్డు ఏర్పాటు చేయలేదని కళాశాలకు సంబంధించిన వెబ్ సైట్ లోను కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు నమోదు చేయాలని కోరారు. దీంతోపాటు చత్రపతి శివాజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బట్టి విక్రమార్కను కోరినట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. వీటితోపాటు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె వెంట బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు అనుమండ్ల జగదీష్ ఉన్నారు.


