Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 07. 01. 2026

ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు, అంతర్గత రహదారుల అభివృద్ధి, విద్యుత్ అంతరాయాలు, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల నిర్వహణ, గ్రామంలో ఆరోగ్య సేవల మెరుగుదల, పాఠశాలల సమస్యలు తదితర అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ జగదాంబ సోమప్ప మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు సూచించిన ప్రతి సమస్యను గమనించి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పాలకవర్గం కట్టుబడి ఉందన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలని కోరారు.ఈ సమావేశంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను నేరుగా పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చారు. జనరల్ బాడీ మీటింగ్ గ్రామ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే విధంగా సఫలంగా ముగిసిందని గ్రామస్తులు తెలిపారు.