సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనవరి 07. 01. 2026బి వీరేశం జనం న్యూస్
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వృత్తిరీత్యా జర్నలిస్టుగా ప్రజల సమస్యలపై ఎన్నో ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తూ, ప్రజా స్వరం గా నిలిచిన వై. జాన రెడ్డి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మహేంద్ర కాలనీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజల కష్టసుఖాలను దగ్గర నుంచి చూసిన అనుభవంతో కాలనీ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలన్న సంకల్పంతో ఆయన ఈ ఎన్నికల బరిలోకి దిగారు.మహేంద్ర కాలనీలో త్రాగునీటి సమస్య, డ్రైనేజీ, రోడ్ల దుస్థితి, వీధి దీపాల కొరత, పారిశుద్ధ్య లోపాలు వంటి అనేక సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించడమే తన ప్రధాన అజెండా అని వై. జాన రెడ్డి స్పష్టం చేస్తున్నారు. జర్నలిస్టుగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై అధికారులను ప్రశ్నించిన తాను, ఇప్పుడు కౌన్సిలర్‌గా ప్రజల తరఫున నేరుగా పాలనలో భాగస్వామిగా మారి పనులు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటి తిరుగుతూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్న వై. జాన రెడ్డి, తనపై నమ్మకం ఉంచితే కాలనీ అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానని హామీ ఇస్తున్నారు. యువత, మహిళలు, వృద్ధులు, కార్మికులు, చిరు వ్యాపారులు ఆయనకు విస్తృతంగా మద్దతు తెలుపుతున్నారు. ఎలాంటి అవినీతి లేకుండా, పారదర్శక పాలనతో ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.జర్నలిస్టుగా నిజాన్ని నిర్భయంగా రాసిన తన అనుభవమే ప్రజలకు ఉపయోగపడుతుందని, సమస్యలపై రాజీపడని తత్వంతోనే కౌన్సిలర్‌గా కూడా పని చేస్తానని వై. జాన రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర కాలనీని అభివృద్ధి పథంలో నడిపించి, ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెబుతూ, ఈ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.



