జనం న్యూస్, జనవరి 07, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :
మండలం లో గల బండలింగపూర్, రాజేశ్వరరావు పేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను, మెట్పల్లిలో గల నరేంద్ర జూనియర్ కళాశాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈరోజు సందర్శించడం జరిగింది, ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ…రానున్న రెండు మూడు నెలల్లో పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, పూర్తిగా చదువుపై దృష్టి సారించాలని సూచించారు,
భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమేనని, చైనా, అమెరికా వంటి దేశాలు విద్యా–సాంకేతిక రంగాల్లో వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు, అలాంటి దేశాలతో పోటీ పడాలంటే మన విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని పిలుపునిచ్చారు,కులం, మతం అనే తేడాలు లేకుండా అందరూ సమానమేనని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడమే నిజమైన విజయం అని తెలిపారు,ఇటీవల గ్రామాల్లో జరిగిన ఎన్నికలు కులం ఆధారంగా ఓటింగ్ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇకపై అలా కాకుండా భవిష్యత్ లో మంచి వ్యక్తిత్వం, సేవాభావం ఉన్నవారిని చూసి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు, నేటి విద్యార్థులు నిజంగా స్వర్ణయుగంలో ఉన్నారని, తాను చదువుకునే రోజుల్లో కరెంట్ వంటి మౌలిక వసతులు కూడా లేవని గుర్తు చేశారు, ప్రస్తుతం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, మంచి విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు హితవు పలికారు. రానున్న పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఉద్దేశంతో ఈ రోజు ప్రత్యేకంగా కళాశాలను పాఠశాలలను సందర్శించడం జరిగిందని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.


