జనం న్యూస్ జనవరి 7, వికారాబాద్ జిల్లా
పూడూరు మండలంలోని కంకల్ గ్రామంలో ఈ రోజు IIMR భారత ప్రభుత్వ చిరు ధాన్యాల పరిశోధన సంస్థ వారి ఆధవర్యంలో రైతుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ రాజా రత్నం పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులు చిరుధాన్యాల ప్రాముఖ్యత మరియు వాటి అవసరాన్ని దృష్టి లో పెట్టుకొని అధికంగా సాగు చేయాల్సిందిగా కోరారు.డివిజనల్ అధికారి శ్రీ లక్ష్మి కుమారి , మండల వ్యవసాయాధికారి శ్రీ తులసి రామ్ , కంకల్ సర్పంచ్ వీరేశ , AEOs సాయరాం, ఎలియాస్, శివ, మరియు కంకల్ గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.



