జనం న్యూస్ జనవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గ్రామంలోని అయ్యప్ప స్వాములు 41 రోజుల పాటు కఠిన నియమాలు ఆచరిస్తూ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు బుధవారం శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ గురు స్వామి సామల బిక్షపతి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రలకు బయలుదేరినా. గురుస్వామి గోపాలకృష్ణ శర్మ స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోష తో భజనలు చేస్తూ అయ్యప్ప మాల విశిష్టత తెలియజేస్తూ స్వాములకు ఇరుముడి కట్టినా రు. అనంతరం స్వాములకు గొట్టుముక్కల రామ్మూర్తి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కుల రమేష్ సామల నాగరాజు వనం విశాల్ సామల రవీందర్ వనం దేవరాజు వినుకొండ రాజ్ కుమార్ బసాని బాలకృష్ణ లోక బోయిన కుమారస్వామి కానుగుల నాగరాజు భక్తులు తదితరులు పాల్గొన్నారు….


