Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ గొల్లపల్లి లోని ఉర్దూ పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పడగొట్టి అదే స్థలంలో 14 లక్షల రూపాయల రాజ్యసభ నిధులతో రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి మంజూరు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు.అలాగే నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ గొల్లపల్లిలోని మండల ప్రాథమిక పాఠశాలను ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువుపై ఆరా తీశారు. అలాగే అంగన్వాడి ప్రైమరీ స్కూల్లో స్లాబ్ పెచ్చులూ డడంతో వాటిని పరిశీలించి దానికి తగిన ఏర్పాటు చేస్తామన్నారు.అలాగే గొల్లపల్లిలో ఏర్పాటుచేసిన నీటి ట్యాంక్ పాచిపట్టి అపరిశుభ్రంగా ఉండడంతో ట్యాంకులు శుభ్రం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొబ్బిళ్ళ త్రినాథ్, షబ్బీర్ అహ్మద్, మండల కోఆప్షన్ సభ్యులు కరిముల్లా ఖాన్, గుణ యాదవ్, తుమ్మల శ్రీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.