

. జనం న్యూస్ 06 ఫీబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లావిషయం:-గద్వాల జిల్లా కేంద్రంలోని దౌధర్ పల్లి గ్రామ సమీపంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు స్వాధీనం చేయుటగూర్చి….తమరితో మనవి చేయునది ఏమనగా గతంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యంమత్రి కెసిఆర్ గారు పేదల కళ్ళల్లో సొంతింటి వెలుగులు చూడాలని,వారి కలలను నెరవేర్చాలని రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని నిర్ణయించి, ఇళ్ల స్థలాలు గుర్తించి నిర్మాణాలు చేపట్టింది.ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు 5 లక్షల రూపాయలు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేశారు.
అందులో భాగంగానే గద్వాల జిల్లా కేంద్రంలోని దౌధర్ పల్లి గ్రామ సమీపంలో దాదాపు 1300 రెండుపడకల ఇండ్ల నిర్మాణం జరిగింది. అట్టి ఇండ్లకు గద్వాల పట్టణంలోని 37 వార్డులకు వార్డుల వారిగా దరఖాస్తులను స్వీకరించి రెవెన్యు అధికారు మరియు గద్వాల పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఒకేరోజు జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో అట్టి ఇండ్లను 2023 సంవత్సరంలో లాటరీ ద్వారా 771 మంది ఇండ్లు లేని నిరుపేదలకు ఎంతో పారదర్శకంగా కేటాయించడం జరిగింది.BRS ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత BRS పార్టీ ద్వారా గెలిచిన స్థానిక MLA పార్టీ మారి అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఐన తరువాత కెసిఆర్ ప్రబుత్వంలో ఇండ్లు పొందిన వారి లిస్టులో అనూహ్యంగా దాదాపు 90 మంది పేర్లను తొలగించి అధికారపార్టీ నాయకుల అనుచరులకు అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అమ్ముకునే కుట్ర జరుగుతుంది.నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని ప్రేమ ఉంటె కొత్తగా ఇండ్లు మంజూరు చేయించాలి గాని KCR ప్రభుత్వం నిర్మించిన ఇండ్లనే ఇందిరమ్మ ఇండ్లుగా చెపుతూ పేదల పొట్టకొడితే పేదల పక్షాన BRS పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి కార్యాచరణ రూపొందించి పేదలకు అండగా ఉంటుంది.KCR ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూములలో లాటరీ ద్వారా కేటాయించిన లబ్దిదారులకు తక్షణమే ఇంటి తాళాలు ఇచ్చి స్వధీనము చేయాలి.అదేవిదంగా గతంలో లాటరీ లో ఎంపికైన వారిన ప్రస్తుత జాబితాలో తొలగించిన లబ్ధిదారుల పేర్లను యధాస్థానంగా ఇండ్లు కేటాయించి వారికి కూడా ఇళ్ల తాళాలు ఇచ్చి ఇళ్ల స్వాధీనం చేయాలని మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని BRS పార్టీ తరువున డిమాండ్ చేస్తున్నాము.ఈకార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి,రాము,తిమ్మప్ప గౌడ్,బజారి,రవి,శ్రీకాంత్,నర్సింలు తదితరులు పాల్గొన్న డా.కురువ విజయ్ కుమార్.BRS పార్టీ రాష్ట్ర నాయకులు,జోగులాంబ గద్వాల జిల్లా.