Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయితీలోని కన్యకా చెరువు ఎర్ర చెరువు సాగునీటి పంట కాలువలు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురి అయ్యాయి ఇప్పటికీ ఉన్న కాలువలన్నీ వాటి మనుగడ కోల్పోయి పూర్తిస్థాయిలో ఖరీదైన భవనాలు వెలిశాయి దీనితో వర్షాలు పడి చేయరు నదిలో నీరు వచ్చినప్పుడల్లా ఆ వరద నీరు అంతా గ్రామములోకి ప్రవేశించి పూర్తిస్థాయిలో నివాస గృహాలు నీట మునిగి అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు సాగునీటి కాలువల ఆక్రమణ విషయమై ఇప్పటికే అనేకమార్లు ఉన్నత స్థాయి అధికారులకు తెలపడ మైనది అయినా కూడా న్యాయం జరగలేదు కన్యకా చెరువుకు కన్యకాసులు సంబంధించిన కాలువల ఆక్రమణపై ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు ఉన్నత స్థాయి అధికారులు సర్వే చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఎటువంటి ఫలితము లభించలేదు దీనితో పూర్తిస్థాయిలో పంట కాలువలు కాలగర్భంలో కలిసిపోవడం జరిగినది ప్రస్తుత పరిస్థితులలో అకాల వర్షాలు సంభవిస్తే గ్రామం తిరిగి వరద నీటిలో మొదట తప్పదు కావున దయవుంచి ఈ పంట కాలువల ఆక్రమణలపై సర్వే నిర్వహించి వాటిని వినియోగంలోనికి తెచ్చి వరదల నుండి ప్రజలను కాపాడతారని సవినయంగా విన్నవించుకుంటున్నాను నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ