

జనం న్యూస్ 06 ఫీబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లాకృష్ణ తుంగభద్ర నదులకు 6 టీఎంసీల నీటి విడుదల విషయంపై…కర్ణాటక రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రిని సిద్ధ రామయ్య గారిని కలవడానికి బెంగళూరుకు బయలుదేరిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్. సంపత్ కుమార్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి.వాకిటి శ్రీహరి సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశం…ఉమ్మడి ఇండెంట్ తుంగభద్రా నదికి 1TMC, కృష్ణ నదికి 5TMC ల సాగు నీరు విడుదల అయితే అలంపూరు ఆర్డిఎస్ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందని మీడియాకు సంపత్ కుమార్ తెలియజేశారు…అలాగే కృష్ణా నదికి ఐదు టీఎంసీల నీరు విడుదలయితే గద్వాల, మక్తల్ కొల్లాపూర్ వనపర్తి రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు…ఈ విషయం RDS రైతులకు తెలియజేయుటకై ఐజ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు K జయన్న కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, దసరి తిమ్మప్ప, మేఘనాథ్ గౌడ్, అబ్రహం, రవీందర్, రవి, చిన్న పాగుంట, పెద్దింటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు