జనం న్యూస్ 08 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు కనికే శశికుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి. ముఖ్య అతిథి మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ. ఈ చారిత్రాత్మక చట్టం గురించి గ్రామీణ ప్రాంతాల్లో గందరగోళాన్ని సృష్టించడానికి సామాన్య ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ మరియు ఇతర పాత్రిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్న చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కార్మికులకి రైతులు గ్రామీణ కుటుంబాలకు జీవితాలను మెరుగు పంచడానికి ఉద్దేశించిన ఈ చెడ్డగాన్ని సంబంధించిన వాస్తవాలు నిజమైన స్ఫూర్తి అసలు లక్షణాలను ప్రజలకు తెలియజేయడం మన కర్తవ్యం వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజన’ గ్రామీణ ఉపాధిలో కంటే ప్రయోజనాత్మకమైన విప్లవాత్మక అడుగు అని తెలియచేశారు.వి బి జి రామ్ జీ వల్ల ప్రయోజనాలు:
100 రోజులకు బదులు 125 రోజులు ఖచ్చితంగా పని కల్పించే హామీ.. ఈ పని ద్వారా ప్రజలు తమ గ్రామాల్లోని ఉపాధి పొంది ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు అని అన్నారు..ఈ పథకం గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వలసలు తగ్గించడం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచడం లక్ష్యంగా పెట్టుకుంది..గ్రామీణ స్తాయిలో ఉపాధి అవకాశాలను పెంచే ఈ పథకం పై విపక్షాలు విషం చిమ్మడం దురదృష్టకరం…రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ, వారి మిత్ర పక్షాలు సృష్టిస్తున్న అపోహలను నమ్మవద్దని తెలియచేశారు.గాంధీ కలగన్న ‘గ్రామ స్వరాజ్యం’ మరియు ‘రామరాజ్యం’ అనే ఆశయాల కలయికతోనే కేంద్ర ప్రభుత్వం వి బి జి రామ్ జీ’కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో ‘రామ్’ అనే పేరు ఉండటం చూసి కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది.గత 15 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకానికి కేవలం లక్ష కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కానీ, మోదీ గారి నాయకత్వంలో గత 10 ఏళ్లలోనే 8 లక్షల కోట్ల రూపాయలను కార్మికుల సంక్షేమం కోసం వెచ్చించడం జరిగింది.రామ నామం పట్ల విద్వేషం మానుకుని, పేదల కోసం జరుగుతున్న ఈ అభివృద్ధిని గమనించాలని అన్నారు…ఈ కార్యక్రమంలో 2023 గద్వాల్ ఎమ్మెల్యే అభ్యర్థి బల్గేరు శివారెడ్డి , జిల్లా ఉపాధ్యక్షుడు సంఘాల సంజీవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు ఉపాధ్యక్షుడు కొంకతి రాము కోశాధికారి రాజేష్ సీనియర్ నాయకుడు గట్టు రాము, తదితరులు పాల్గొన్నారు.


