Listen to this article

సర్పంచ్ అనుశ, కార్యదర్శి జ్ఞానదేవ్,

జనం న్యూస్,జనవరి 08,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని ముర్కుంజల్ గ్రామ సచివాలయంలో గురువారం సర్పంచ్ అనుశ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని త్రాగునీరు, మురికి కాలువలు,వీధి దీపాలు,నర్సరీ,పిచ్చి మొక్కల తొలగింపు, చేతిపంపుల రిపేర్ల గురించి ప్రజల సమక్షంలో చర్చించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా అత్యవసరమైన సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే సమస్యలను పరిష్కరించే దిశగా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ముందుకు సాగుతానని అన్నారు.ప్రస్తుతం గ్రామానికి అవసరమయ్యే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళదామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయ్ కుమార్ పాటిల్,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, సాయ గౌడ్, వైజ్యనాథ్ రావు,నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,జ్ఞానేశ్వర్, శ్రీకాంత్,రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు