

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), ఫిబ్రవరి 06 (జనం న్యూస్):గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజల మనసు గెలుచుకున్న గొప్ప నేత, నియోజకవర్గము ఉన్నన్ని రోజులు, ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తూ నియోజక అభివృద్ధిని సువర్ణ అక్షరాలతో తన పరిపాలన లిఖించబడి ప్రజా రంజికంగా పరిపాలించిన నేత, గొప్ప మనసున్న నేతకు, పుణ్య దంపతులైన పెద్దలు అన్నా వెంకట రాంబాబు అన్న కి మరియు, దుర్గా కుమారికి, పెళ్లిరోజు శుభాకాంక్షలు.మన అందరి ప్రియతమ నేత అన్నా రాంబాబు అన్న కి పూర్తి బలం దుర్గా కుమారి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దుర్గా కుమారి ఎప్పుడు భర్త అడుగుజాడల్లో నడుస్తూ, కష్ట సుఖాలలో పూర్తిగా అండగా ఉంటూ, తమ ఇంటికి వచ్చిన ప్రతి వారిని గౌరవంగా పలకరిస్తూ, వచ్చినవారికి మర్యాదలు చేస్తూ, భర్త యొక్క గౌరవం అనేది ప్రజలలో పెరగడానికి ఇది ఒక బలమైన కారణమని చెప్పవచ్చు. పెద్దాయన ఇంటికి వెళితే ఖచ్చితంగా స్వీట్ ఇస్తారు, మంచినీళ్లు ఇస్తారు, కాఫీ గాని టీ గాని ఇస్తారు, దగ్గర కూర్చోబెట్టుకొని పలకరించి సమస్యను తీరుస్తారు, అనే భావన గిద్దలూరు నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజలలో ,బలంగా ఉంది. అందుకే మాజీ శాసనసభ్యులను తమ గ్రామానికి వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ గౌరవించి ఇంటికి తీసుకెళ్లి మర్యాద చేస్తారు. అలాంటి గొప్ప నేత రాజకీయాలలో ఉండడం అనేది ఓ గొప్ప విశేషమని చెప్పవచ్చు.మాజీ శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు మరియు దుర్గాకుమారి, పదికాలాలపాటు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరోసారి పెళ్లిరోజు శుభాకాంక్షలు అన్న