Listen to this article

శ్రమదానంతో రోడ్డు మరమ్మతు

జనం న్యూస్8డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

​ తిర్యాని: మారుమూల గ్రామాల రహదారి కష్టాలను తీర్చేందుకు ‘అనిల్ అన్న యువ సైన్యం’ ముందుకొచ్చింది. తిర్యాని మండలంలోని మంగి – ముల్కలమంద గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తోయగూడ నుండి భీమ్రాల వరకు వెళ్లే రహదారి గత కొంతకాలంగా పూర్తిగా గుంతలమయమై ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది.​ఈ విషయాన్ని స్థానిక గ్రామస్తులు అనిల్ అన్న యువ సైన్యం సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా, వారు తక్షణమే స్పందించారు. గురువారం యువ సైన్యం సభ్యులు స్వచ్ఛందంగా తరలివచ్చి, సొంత ఖర్చులతో మొరం పోయించి గుంతలను పూడ్చి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. యువత చేసిన ఈ సామాజిక సేవా కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ముల్కలమంద సర్పంచ్ కుడిమేత హనుమంత్ రావు, ఉప సర్పంచ్ అర్క మల్లేష్‌ కుడుమేత రమేష్, ఉయిక గోవింద్ మరియు గ్రామస్తులు పాల్గొని శ్రమదానం చేశారు.