Listen to this article

జహీరాబాద్ జనం న్యూస్ జనవరి 08. 01. 2026 నియోజకవర్గంలో

నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్‌ను సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ జర్నలిస్ట్ బి.వీరేశం మర్యాదపూర్వకంగా కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించడంలో కమిషనర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. జహీరాబాద్ పట్టణ అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగవంతమైన నిర్ణయాలు అవసరమని పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ పాలనలో మీడియా–పాలన మధ్య సమన్వయం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. నూతన కమిషనర్ పాలనలో జహీరాబాద్ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి సాధించాలని బి.వీరేశం ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.