జనం న్యూస్ జనవరి 8 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ రూపొందించిన మార్గదర్శకాల అమలు పై ప్యానెల్ బృందం క్షేత్ర స్థాయి లో తనఖిలు చేపట్టింది. గురువారం ఎల్కతుర్తి మండలం లోని బావుపేట గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను జిల్లా ప్యానెల్ బృందం అధికారి యం. వేణు ఆనంద్ ఆధ్వర్యంలో సమగ్ర పరిశీలన నిర్వహించారు. పాఠశాల లో విద్యా బోధన, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు, విద్యార్థుల అభ్యాసన స్థాయి వంటి అంశాలను పరిశీలించారు. పాఠ్యపుస్తకాల వినియోగం, బ్లాక్ బోర్డు పనితీరు, విద్యార్థుల భాగస్వామ్యం వంటి అంశాల ద్వారా విద్యాభోధన నాణ్యత గురించి ఆరాతీశారు. అదేవిధంగా పాఠశాల మౌలిక వసతులపై కూడా సమగ్ర తనిఖీ చేశారు.తాగునీటి, సౌకర్యం, మరుగుదొడ్ల పరిశుభ్రత, తరగతి గదుల స్టితి, ప్రహారీ భద్రత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్యానెల్ బృందం సభ్యులు యం. వేణు ఆనంద్ మాట్లాడుతూ పాఠశాల లో పరిశీలించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి జిల్లా అధికారులకు అందిస్తామని తెలిపారు. అవసరమై చోట మెరుగుదల సూచనలు కూడా నివేదికలో పొందుపరుస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో ప్యానెల్ సభ్యులు ఏ. నవీన్ కుమార్, మధుసూదన్ రెడ్డి, యం. వేణు ఆనంద్,కృష్ణ మూర్తి, ఎస్. ఎఫ్ అలీ,నవీన్ కుమార్, నర్సయ్య, మహిపాల్ పట్నాయక్, ప్రధానోపాధ్యాయులు ఎల్. మనోహర్ నాయక్, ఉపాధ్యాయులు శ్రీధర్, మోహన్ రావు, ముకుంద రెడ్డి,యం. రవికుమార్ అనితా, రాధిక, శారదా,తదితరులు పాల్గొన్నారు


