

బేస్తవారిపేట ప్రతినిధి, ఫిబ్రవరి 06 (జనంన్యూస్):-వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగ అధ్యక్షుడిగా కంభం పట్టణానికి చెందిన ఏషపోగు మధుబాబు నీ నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని ప్రజా సమస్యలపై ధ్వజమెత్తుతారని తెలిపారు.. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులుభూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి, కుందురు నాగార్జున రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు..