“ఏమమ్మా ప్రెసిడెంట్ ఎలా ఉన్నారు? అని పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి
జనం న్యూస్ 8కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సుగుణక్క మర్యాదపూర్వకంగా పలకరించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుగుణక్కను ఆత్మీయంగా “ఏమమ్మా ప్రెసిడెంట్ బాగున్నారా?” అంటూ పలకరించారు. సీఎం ఆత్మీయ స్వాగతంతో సుగుణక్క ముఖంలో చిరునవ్వు వెల్లివిరిసింది.సమావేశం అనంతరం సీఎం తో భేటీ ఐన సుగుణక్క జిల్లా అభివృద్ధి, గిరిజన ప్రాంతాల సమస్యలు, ప్రజల సంక్షేమ పథకాలు, రోడ్లు, తాగునీరు, ఉపాధి హామీ వంటి కీలక అంశాలపై సుగుణక్క ముఖ్యమంత్రితో చర్చించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ప్రజలకు అవసరమైన పలు అభివృద్ధి పనులపై సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్


