Listen to this article

జనం న్యూస్ జనవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

ఎస్ టి యు . యూనియన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు . ఎస్ టి యు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్ ను కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, నడింపల్లి సూర్యనారాయణ రాజు, (సూరిబాబు రాజు) నడింపల్లి సందీప్ వర్మ ఎర్రజర్ల దేవి ఉదయ్ రవి కిరణ్, వేపూరి భాగ్యరాజువారి ఆర్థిక సహకారంతో మండల అభివృద్ధి అధికారి రాజేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారీ నామాల కృష్ణ మోహన్, , చేతుల మీద విద్యార్థులు అందించడం జరిగింది. సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా ఈ మెటీరియల్ చదివి విద్యలో మంచి ఉత్తీనత సాధించాలని మన గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని కోరారు. అలాగే చెయ్యరు, పీ.లక్ష్మీ వాడ, కందికుప్ప దొంతికుర్రు, పల్లం, సాపెవారిపల్లి, గట్చకయలపోర హైస్కూల్ లకు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించడం జరిగింది ఈ కార్యక్రమం సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, జిల్లా అధ్యక్షులు పోతంశెట్టి దొరబాబు, ప్రధాన కార్యదర్శి కె.కళ్యాణ్బాబు మండల ఎస్ టి యు అధ్యక్షులు వి. నరసింహ మూర్తి, ప్రధాన కార్యదర్శి కె. లోవప్రసాద్ యూనియన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.