Listen to this article

జనం న్యూస్‌ 09 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు మరియు ఈగల్ సిబ్బందికి రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 5 గొనె సంచులలోగల 76.530 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో జనవరి 8న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – డెంకాడ పోలీసులకు మరియు ఈగల్ పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో జనవరి 8న డెంకాడ మండలం, బొడ్డవలస గ్రామ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి, ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 5 గొనె సంచులలోగల 76.530 కిలోల గంజాయి, కెఎ 19 ఎంఎల్ 1002 నంబరుగల కారు, రెండు సెల్ ఫోన్లను సీజ్ చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో (ఎ-1) కేరళ రాష్ట్రం కసర్గడ్ జిల్లా ఉప్పల గ్రామానికి చెందిన మోయిదీన్ నవాజ్ (39 సం.లు), (ఎ-2) కేరళ రాష్ట్రం కసర్గడ్ జిల్లా ఉప్పల గ్రామానికి చెందిన సయ్యద్ జంషీద్ (30 సం.లు) గా విచారణలో గుర్తించామన్నారు. విచారణలో ఇద్దరు నిందితులు ఒడిస్సా రాష్ట్రం, సిమిలిగూడలో కొనుగోలు చేసి కేరళ రాష్ట్రంకు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. అనంతరం నిందితులను రిమండుకి తరలించా మన్నారు. నిందుతులపై ఫైనాన్సియల్ ఇన్విస్టెగేషను, పిట్ ఎన్.డి.పి.ఎస్. చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తామని, పి.డి. చట్టంను కూడా ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.ఈ కేసులో నిందితులను అరెస్టు, గంజాయిని సీజ్ చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, డెంకాడ ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు, ఈగల్ సిబ్బంది మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, డెంకాడ ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు, ఈగల్ సిబ్బంది మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.