Listen to this article

ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యం..
▪️ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి..

జనం న్యూస్ //ఫిబ్రవరి //6//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టుభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ని బలపరుస్తూ,వి. నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా,కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. బుధవారం రోజున కరీంనగర్ ఇ.ఎన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనం లో, ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి,అడుగడుగునా ఘన స్వాగతం పలికిన యువజన కాంగ్రెస్ నాయకులు..ఈ సందర్బంగా జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ; విద్యావంతుడు ఉపాధ్యాయుడు ఎన్నో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎంతో మందికి గొప్ప భవిష్యత్తును మంచి విద్యను అందిస్తూ, ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వ్యక్తి, ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి అన్నారు.గెలుపును యువజన కాంగ్రెస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని యువజన కాంగ్రెస్ నాయకులంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నిక యువజన కాంగ్రెస్ భుజాల వేసుకొని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహుమతిగా ఇవ్వాలని జక్కిడి శివచరణ్ రెడ్డి తెలపారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి వోల్లాల రవి తదితరులు పాల్గొన్నారు.