Listen to this article

జనం న్యూస్: జనవరి 9 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)

పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. బ్రాహ్మణ కుటుంబంలో మరణం సంభవిస్తే
సంబంధిత కుటుంబానికి రూ. 10,000/- ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ పథకం కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు రూపకల్పన చేయబడింది.ఇప్పటికే పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది. అమరావతి సచివాలయంలో మంత్రి సవిత గారు – బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ గారితో సమావేశమై గరుడ పథకం అమలు విధానంపై చర్చించారు. అధికారిక మార్గదర్శకాలు విడుదలైన వెంటనే పూర్తి వివరాలు తెలియజేయబడతాయి.