జనం న్యూస్ జనవరి 08: నిజామాబాద్ జిల్లా
బాల్కొండ మండలంలో ఉన్న శాంభవి హై స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ మరియు 10వ తరగతులకు చెందినవిద్యార్థిని , విద్యార్థులే ఉపాద్యాయులై నర్సరీ నుండి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మధుసూదన్ రాజు బొట్ల ప్రతి తరగతిని సందర్శించి విద్యార్థులు పాఠాలు చెప్పిన విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “నేటి బాలలే రేపటి పౌరులు. విద్య అనేది నిరంతర ప్రక్రియ. ‘విద్యావాన్ లభతే జ్ఞానం’ అని పెద్దలు చెప్పినట్లు, విద్య లేనివాడు వింత పశువుతో సమానం. సమాజ అభివృద్ధికి విద్య అత్యంత అవసరం. ప్రతి విద్యార్థి నూతన పద్ధతులను అవలంబించి, కార్యసాధనలో ముందుకు సాగి విజయాలను సాధించాలి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రవీన్ ప్రసాద్, ప్రిన్సిపల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపల్ మంజులతో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


