Listen to this article

జనం న్యూస్ జనవరి 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని గోవిందాపురం గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థినిలకు కీర్తిశేషులు బాసాని కైలాసం కనకలక్ష్మి జ్ఞాపకార్ధంగా వారి కుమారులైన బసాని జయప్రకాష్ మాజీ ఎంపీపీ బసాని చంద్ర ప్రకాష్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ పరీక్ష ప్యాడ్స్ పెన్నులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా విద్యార్థిలకు అందజేశారు అనంతరం మాజీ ఎంపీపీ బసాని చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ మా యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు అందించడంలో సంతోషకరమని అన్నారు విద్యార్థులు మండలంలోనే మొదటి ర్యాంకు సాధించిన వారికి 5000 రూపాయలు బహుమతిగా ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాణి చంద్ర ఎం ఈ ఓ బిక్షపతి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న) రవీందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్ల చక్రపాణి డిటీ రెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల ప్రిన్సిపాల్ మాధవి టీచర్లు తదితరులు పాల్గొన్నారు….