Listen to this article

జనంన్యూస్. 06. నిజామాబాదు. ప్రతినిధి. సిరికొండ : యాదగిరి అన్న స్పూర్తితో బలమైన విప్లవోధ్యమాలను నిర్మిద్దాం.త్యాగాల ఒరవడికి నిదర్శనం కామ్రేడ్: కర్నాటి.యాదగిరి అన్న అమరజీవి, ఆచరణ వాది కామ్రేడ్..యాదగిరి అన్న అని, విప్లవోధ్యమ కార్యశీలి అని ఆయన స్పూర్తితో బలమైన విప్లవోధ్యమాలను నిర్మించాలని మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపును ఇచ్చారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సి పి ఐ.మాస్ లైన్. మండల కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభనునిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు: కామ్రేడ్. యాదగిరి అన్న జిల్లాలో విప్లవోధ్యమ నిర్మాణంకు పునాదులు వేసిన మూల స్థంభంలాంటి వాడు అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికి ఆదర్శంగా నిలిచాడు అన్నారు. సిరికొండ మండలంతో పాటు భీంగల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్ట్ యోధుడు అన్నారు. కులావివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంకు కృషి చేసాడని ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించాడమే అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు. రామకృష్ణ మాట్లాడుతు: నేటి యువతకు ఆదర్శంగా కామ్రేడ్. యాదగిరి అన్న ఆదర్శంగా నిలిచాడని ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాంచాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంకు .మాస్ లైన్
సిరికొండ మండల కార్యదర్శి . రమేష్ అధ్యక్షత వహించగా డివిజన్ నాయకులు . రాజేశ్వర్, పార్టీ సీనియర్ నాయకులు. నడ్పిరాములు, గడ్కోల్ గ్రామ కార్యదర్శి. లింభాద్రి డివిజన్ నాయకులు దామోదర్, బాబాన్న, . రమ, పుష్పలత, . మానస. గంగామణి, రమేష్ . కిశోర్. అనిస్, కిశోర్, కట్టరాములు తదితరులు పాల్గొన్నారు.