Listen to this article

జనం న్యూస్ ; 9 డిసెంబర్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట:

శ్రీవాణి స్కూల్‌లో స్వపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహిస్తూ, చిన్నారులకు పాఠాలు, బోధించారు.ఈ కార్యక్రమానికి డీఈఓ గా ఎస్. మణికర్ణిక, కరెస్పాండెంట్ గా ఏ. అక్షిత, ప్రిన్సిపాల్ గా టీ. అభిలాష్ ఒక్క రోజు విధులు నిర్వహించి వారి అనుభవాలు పంచుకున్నారు.అంతరం పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మంచి పరిపాలన, క్రమశిక్షణ, బాధ్యతలపై అవగాహన కల్పించారు.విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం గెలుపొందిన సీనియర్ విభాగంలో మొదటి బహుమతి వి .అక్షయ ,అనిరుద్, రెండో బహుమతి పి కీర్తన లక్ష్మీప్రసన్న కన్సోలేషన్ ఇ.అభిలాష్ , జూనియర్ విభాగంలో సి.హెచ్ వర్షిని , రెండో బహుమతి కె .అనన్య. కన్సోలేషన్ బహుమతి కె.పూజ విద్యార్థిని ,విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ స్వపరిపాలనా కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.