జనం న్యూస్ డిసెంబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ
కేంద్రంలో శుక్రవారం నాడు రెండు నెలలుగా గ్రామంలో నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట ధర్నా చేసి ఆవేదన వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రెండు నెలలుగా నల్లాల నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు మరియు గ్రామపంచాయతీ కార్యవర్గానికి విన్నవించుకున్న నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారని మండిపడ్డారు. పండుగ దగ్గరికి వస్తున్న కనీసం వాడుకోవడానికి కూడా నీళ్లు లేక బోర్ల కానుండి బిందెలతో పోసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి తమకు నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్ణమ్మ, ఈశ్వరమ్మ,లింగమ్మ,గంగమ్మ, యాదమ్మ,హేమలత,స్వప్న, రమ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


