బిచ్కుంద జనవరి 9 జనం న్యూస్
విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి సూచించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫేర్వెల్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దర్పల్ గంగాధర్, అసద్ అలీ, గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాలని వారు సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు.ఫేర్వెల్ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల అద్భుత ప్రదర్శనలు, యువతీయువకుల డీజే డాన్స్ కళాశాల విద్యార్థులకు ఆనందాన్ని కలిగించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి మరియు లెక్చరర్లు శివ కుమార్, నాగరాజు, శంకర్, సంజు, సామ్సన్ మరియు ఉర్దూ మీడియం కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




