Listen to this article

జనం న్యూస్ జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈనెల 12న విడుదల సందర్భంగా..తొలి టికెట్ ను వేలంపాటలో రూ.1,11,000లకు దక్కించుకుని హైదరాబాద్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర నిర్మాత కొణిదల సుస్మిత చేతులమీదుగా సత్కరించబడిన బీజేపీ నాయకులు మోకా వెంకట సుబ్బారావును ది.అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురం ప్రెస్ క్లబ్‌ నందు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మోకా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో పాటు ఈ కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో తొలి టికెట్ వేలంలో పాల్గొన్నట్లు తెలిపారు.ఈ సత్కార కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంచిపల్లి అబ్బులు, ఛాంబర్ అధ్యక్షుడు బోనం సత్యవరప్రసాద్, చింతలపూడి సత్తిబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు, మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ చిక్కాల ముద్దుబాబు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ, కర్రి చిట్టిబాబు, గోల్డ్ మార్కెట్ అధ్యక్షుడు ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి, సెక్రటరీ యర్రంశెట్టి నారాయణమూర్తి, వలవల శివరావు, చిట్టూరి రాజేశ్వరి, అయినవిల్లి సత్తిబాబుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.