

ఈ యజ్ఞంలో భక్తులు భక్తితో పాల్గొన్నారు
-భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
జనం న్యూస్,ఫిబ్రవరి 6, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)హరిహర లిఖిత మహాయజ్ఞం రామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో గ్రామ, గ్రామాన నిర్వహించారు. అందులో భాగంగా సిద్దిపేట గ్రామం, మరియు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి లక్షకు పైగా రామ,శివ నామాలు లిఖించిన పత్రాలను నాసర్ పుర హనుమాన్ దేవాలయంలో సీతారామాంజనేయ సేవా సమితి, సేకరించి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు దేవాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ లోక కళ్యానార్థం జరుగుతున్న లిఖితయజ్ఞంలో పాలుపంచుకోవడం ప్రతి భక్తుడు భక్తితో లిఖించి అందించడం, భక్తికి నిదర్శనం అన్నారు. అనంతరం రామకోటి రామరాజును సీతారామ సేవా సమితి ఘనంగా సన్మానించారు.పెందోట శ్రీనివాస చారి, బోనాల శ్రీనివాస్, అయిత శ్రీకాంత్, జాప మధు, కాసోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.