వెంకన్న ఆలయంలో వస్త్రదానం..
జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ప్రతి సంవత్సరం నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా చిందాడగరువు ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పేదలకు వస్త్రదానం చేశారు.ఆలయ చైర్మన్ కంచిపల్లి అబ్బులు సమక్షంలో ఆలయ ప్రాంగణంలో పనిచేస్తున్న మహిళా కార్మికులు, యాచకులు, వృద్ధులు, అనాధలకు వస్త్రాలను పంపిణీ చేశారు.అదేవిధంగా అమలాపురం పట్టణంలోని వివిధ దేవాలయాల్లో ఉన్న యాచకులకు మొటూరి దంపతులు 100 దుప్పట్లు, 100 చీరలను అందజేశారు.పేదల సేవే పరమార్థమని భావిస్తూ మొటూరి దంపతులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం పలువురి ప్రశంసలను అందుకుంది.ఈ సేవా కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పి. మాల కొండయ్య, బీజేపీ రాష్ట్ర నాయకులు మోకా సుబ్బారావు, ఏపీడబ్ల్యూఐజేయు కోనసీమ అధ్యక్షులు మండేల బాబి, జనిపిరెడ్డి సురేష్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పేరూరు విజయలక్ష్మి, ఆలయ ఈవో పివివి సత్యకుమార్, పట్నాల వెంకటరమణ, పెద్దిరెడ్డి రాము, డి.ఎస్.ఎన్. కుమార్, అర్లపల్లి దుర్గ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


