Listen to this article

జనం న్యూస్ జనవరి 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలానగర్ 120వ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు దొంతిరి సోమిరెడ్డి, జనరల్ సెక్రటరీ వంగాల వీరేందర్ రెడ్డి కోశాధికారి ఇనుగాల మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే రెడ్డి సంఘం సీనియర్ సభ్యులు డి. శంకర్ రెడ్డి, పి. మనోహర్ రెడ్డి, కె. విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు, సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వక్తలు సంఘం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసిస్తూ, నూతన సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షించారు.