జనం న్యూస్: జనవరి 10 శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
రాబోయే జనవరి 18న జరగనున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యక్రమ ఏర్పాట్లు, బాధ్యతల పంపిణీ, వేదిక ఏర్పాట్లు, అతిథుల ఆహ్వానం, భోజన ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో విష్ణుమూర్తి సార్, జి. బాలకిషన్ సార్, వై. రమేష్, బి. పవన్ కుమార్, పి. వేణుగోపాల్, బి. బిక్షపతి, పి. బ్రహ్మానందం, మాన్సూర్ అహ్మద్ , ఎన్. అంజలి, వి. రమాశ్రీ, డా. ఎస్. సువర్ణదేవి, ఎం. సౌజన్య, నాగరాణి పాల్గొన్నారు.ప్రతి ఒక్కరికీ తగిన బాధ్యతలు కేటాయించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని డా. శ్రద్ధానందం సూచించారు. జనవరి 18న జరగనున్న ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.


